ఫ్యూచర్ లో ఆన్ లైన్ ఎలాంటి ఎడ్యుకేషన్‌‌కి దారితీయబోతోంది?

రోజూ స్కూల్‌‌, కాలేజీ క్లాస్‌ రూమ్‌‌లో జరగాల్సిన క్లాస్‌.. డిజిటల్‌ ‌క్లాస్‌ రూమ్‌‌లో జరుగుతాయని ఎవరూ ఎక్స్‌‌పెక్ట్ చేయలేదు. అలాగని, ఫ్యూచర్‌‌‌‌లో ఆన్‌‌లైన్‌‌లో క్లాస్‌లు జరగాలనీ కోరుకోలేదు. లాక్‌‌డౌన్‌ ‌మొదలైనప్పటికి నుంచి మనం టెక్నాలజీకి ఇంకా ఎక్కువ దగ్గరయ్యాం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు టెక్నాలజీ సాయంతో ఈ క్రైసిస్‌‌లో కూడా నార్మల్‌‌గా బతకగలుగుతున్నారు. అయితే, ఈ టెక్నాలజీ మన స్టూడెంట్స్‌‌కి ఎంత వరకు ఉపయోగపడుతుంది? ఫ్యూచర్‌‌‌‌లో ఇది ఎలాంటి ఎడ్యుకేషన్‌‌కి దారితీయబోతోంది?

సోషల్‌‌ డిస్టెన్స్ మొదలైనప్పటి నుంచి దూరం దూరం ఉండి పనులు చేయడం ఎలా? స్కూళ్లూ, కాలేజీలు ఎలా నడుస్తాయి? ఇన్నిరోజులు ఇంట్లోనే ఉంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ? అని చాలామంది టెన్షన్ పడ్డారు. టెక్నాలజీ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చింది. అందులో ముందుగా వచ్చింది జూమ్‌‌యాప్‌‌.జూమ్‌‌లో క్లాస్‌‌లు స్టార్ట్ అయ్యాయి. వారం రెండువారాల తర్వాత జూమ్‌‌‘ప్రైవసీ డిజాస్టర్‌‌’అని ప్రపంచమంతా కోడైకూసింది. దీంతో ఇంట్లో ఎలా టెక్నాలజీని ఇంప్లిమెంట్స్ చేసుకోవాలి.? ఇంటినుంచే జీవితాన్ని ఎలా కొనసాగించాలి? అసలే కరోనాతో భయపడి చస్తుంటే..ఈప్రైవసీ సంగతేంటని భయపడ్డారు. టెక్నాలజీ లేకుండా నార్మల్‌‌గా బతకలేని పరిస్థితి. అందుకే, క్రియేటివ్‌ ‌టెక్నాలజీ దారులను కనుక్కొని ఇంట్లోనే ఆన్‌‌లైన్‌ పాఠాలు వింటున్నారు.

డిజిటల్ లిటరసీ

“ఇలాంటి రోజు ఒకటివస్తుందని ఎవరూ ఊహించ లేదు. కాబట్టి టెక్నాలజీ వాడకం గురించి అంతగాఎవరూ పట్టించుకోలేదు.కానీ, అందరికీ డిజిటల్ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ కచ్చితంగా వాడాల్సిన అవసరం వచ్చింది. అందుకే, ప్రతిఒక్కరూ ఇప్పుడు టెక్నాలజీ వాడకాన్ని నేర్చుకుంటున్నారు. ఇంటి అవసరాల నుంచి మొదలు పెడితే ఆఫీస్ వర్క్, ఆన్‌‌లైన్ క్లాస్‌‌లు ఇలాఅన్నీ డిజిటెక్నాలజీపై ఆధారపడ్డాయి.కాబట్టి, ఇప్పుడు ప్రతిఒక్కరికీ డిజిటల్ లిటరసీ అవసరమైంది. టెక్నాలజీ చాలా యూజ్‌‌ఫుల్‌‌కానీ,అది క్లాస్‌‌రూమ్‌‌ని రీప్లేస్ చేయలేద”ని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డిజిటల్ పెడగాలజీ డెరెక్టర్‌ మైకెల్ మోరీస్ చెప్పాడు.

మార్చిలో అమెరికా స్కూళ్లు మూసేసినప్పటి నుంచి కొన్నిరోజుల పాటు స్కూళ్లు తెరవడం ఎలా? అని ఆలోచించారు. టీచర్స్, పేరెంట్స్‌‌తోచర్చలు కూడా జరిపారు. తర్వాత డిజిటల్ ప్లాట్‌ ‌ఫామ్స్‌పై టీచింగ్‌ కొనసాగించాలని నిర్ణయించారు. తర్వాత ప్రపంచమంతా దీన్నే ఫాలోఅయింది. మార్చి నెలలోనే జూమ్‌‌లాంటి ఆన్ లైన్ మీటింగ్  ప్లాట్‌ ‌ఫామ్‌లో సైన్అయ్యే వారి సంఖ్య 73శాతం పెరిగింది.

నాణేనికి రెండో వైపు

“స్టూడెం ట్ క్లాస్‌‌ వింటున్నట్టు టీచర్‌‌కి కనపడినా..అతని అటెన్ష న్‌ని టీచర్ పసిగట్టలేడు. స్టూడెంట్స్‌ ‌తో ఇంటరాక్ట్ అవడం కూడా కష్టంతో కూడుకున్నదే. పిల్లలనుంచి ఫీడ్‌‌ బ్యాక్ అందదు. అయితే, పిల్లలంతా బాగా వింటున్నారనే ఆశిస్తున్నా”అని ప్రొఫెసర్ ఎడ్రిన్గ్రాహం చెప్పాడు.

ట్రెల్లో

.. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడెం ట్స్‌తో టీచర్స్‌‌కంటే పేరెంట్సే దగ్గరగా ఉంటున్నారు. స్టూడెంట్స్‌‌చదువు బాధ్యత సగం ఇప్పుడు పేరెంట్స్‌‌మీదకూడా ఉంది.ఆన్‌‌లైన్‌‌లో క్లాస్‌‌లు చెప్తున్నా..అసైన్‌‌మెంట్స్‌‌, ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు.  ఈహోం వర్క్‌‌కి సంబంధించిన ఫైల్స్‌ని ట్రెల్లో యాప్‌‌ నుంచిషేర్ చేస్తున్నారు. వర్క్ చేసినట్టు ప్రూఫ్‌తో పాటు డౌట్స్,ప్రశ్నలు కూడా ఈయాప్‌‌ ద్వారాఅడగొచ్చు”అని ట్రెల్లో ఫౌండర్‌ మైకెల్ ప్రయర్అన్నాడు. ఇప్పుడు చాలామందిటీచర్లు ట్రెల్లో యాప్ వాడటం మొదలుపెట్టారు. హోంవర్క్‌ని ని జాయితీగాచేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఫ్యూచర్‌‌లోకూడా దీని వాడకం పెరిగేఅవకాశం ఉంది. టీచర్లు, పేరెంట్స్ ‌ట్రెల్లో ద్వారా  మ్యూనికేట్ అవుతున్నారు. లెసన్ ప్లాన్స్, వర్క్‌‌ ఫ్లో, హోమ్ ‌‌వర్క్ ఇలా అన్నీ ఇందులోషేర్ చేసుకోవచ్చు.టీచింగ్‌ని ఎంత వరకు విస్తరించగలమో ఈటెక్నాలజీలన్నీ ప్రూఫ్స్ చూపిస్తున్నాయి.

ఈక్వాలిటీ లేదు క్లాస్ ‌‌రూమ్‌‌లెర్నింగ్‌‌తో పోల్చితే రిమోట్ లెర్నింగ్‌‌లోఅసమానతలు కూడా చాలా ఎక్కువగాఉన్నాయి. ఎడ్యుకేషన్‌‌కి టెక్నాలజీ ఇంక ఎంత వరకు సపోర్ట్ చేస్తుందని పేరెంట్స్, టీచర్స్ ఆలోచిస్తున్న టైంలోనే కొన్నికొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పిల్లల చదువు కోసం టైం కేటాయించే పేరెంట్స్ ఎంతమంది ? టెక్నాలజీ వాడకం తెలిసిన పేరెంట్స్ ఎంతమంది ?అంటే.. చాలాతక్కువే ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ ఇళ్లల్లో‌ ఇంటర్నెట్ సదుపాయం లేదు. కొంతమంది ఇంటర్నెట్ స్పీడ్ సరిగ్గా లేక క్లాస్‌‌కి అటెండ్ ‌‌కాలేకపోతున్నారు. ఫోన్‌‌, కంప్యూటర్‌లు కొనలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. క్లాస్‌‌రూం ఎడ్యుకేషన్‌‌లో బయటపడని ఎన్నో అసమానతలు ఆన్‌‌లైన్‌ క్లాస్‌‌ల వల్ల బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెక్నాలజీ క్లాస్‌‌లను కూడా రివైజ్ చేయాల్సినఅవసరం ఉంది.ప్యూచర్ ఎడ్యుకేషన్‌ కచ్చితంగాఇలాంటిటెక్నాలజీమీదఆధారపడి ఉండకూడదనేఅంతా కోరుకుంటున్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ సమానంగాఎడ్యుకేషన్అందించేలా డిజిటల్ టూల్స్‌ని ఎలామార్చాలి? క్లాస్‌‌రూం లోపల, క్లాస్‌‌రూం బయటఅందరికీ సమాన అవకాశాలు ఎలాకల్పించాలి?”అనేది ఇప్పుడు ఎడ్యుకేటర్స్‌‌,టెక్నాలజీ కంపెనీలముందుఉన్న అసలు సిసలు పరీక్ష!

Latest Updates