నాకు 50 నుంచి 70లక్షల మందితో స్వాగతం పలకాలి

భారత్ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.  ఈ నెల 24, 25న ట్రంప్ ఢిల్లీ ,గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. అయితే  అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి స్టేడియం వరకు  తనకు ఘన స్వాగతం పలికేందుకు లక్షలాది మంది భారతీయులు రెడీగా ఉన్నారన్నారు. తాను మోడీతో ఫోన్ లో మాట్లాడినట్లు చెప్పారు. అమెరికాలో మాదిరిగా 40, 50 వేల మంది కాదని తనకు 50 నుంచి 70లక్షల మంది  స్వాగతం పలకాలంటూ సరదగా కామెంట్ చేశారు ట్రంప్. అహ్మాదాబాద్ లో కొత్తగా నిర్మించిన మోటేరా స్టేడియంలో మోడీ, ట్రంప్ ప్రసంగించనున్నారు. ఇది  ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం.

see more news

హోటల్లో కలుషిత ఆహారం తిన్న కుటుంబం ..చిన్నారి మృతి

ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు..ఒకరు మృతి

మింత్రాతో జతకట్టిన విజయ్ ‘రౌడీ‘ ఫ్యాషన్ బ్రాండ్

టీ20లకు గుడ్ బై చెప్పనున్న స్టార్ క్రికెటర్

Latest Updates