లాలాపేట్: డెంగీతో చనిపోయిన చిన్నారి

సికింద్రాబాద్ లోని లాలాపేట్ లో డెంగీ తో ఓ చిన్నారి చనిపోయింది. లాలాపేట్ కు చెందిన మధుసూదన్ రెడ్డి కూతురు రుత్విక ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతుంది. మొదట స్థానిక హాస్పిటల్ ట్రీట్ మెంట్ చేయించారు. అయినా తగ్గకపోవడంతో ప్రైవేట్  హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు పాపకు డెంగీ అని చెప్పారు. పాప పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతున్న రుత్విక ఈ రోజు ఉదయం చనిపోయింది.

లాలాపేట్ చుట్టుపక్కల అపరిశుభ్రత ఎక్కువగా ఉందని.. దోమలు ఎక్కువగా ఉండటంతోనే ఘటన జరిగిందని వాపోతున్నారు స్థానికులు. చెత్త చెదారం కాలనీలో పేరుకుపోతున్నాయని… అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు. కనీసం తమ కాలనీకి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు.

Latest Updates