చిన్నారిని బలిగొన్న స్విమ్మింగ్ పూల్

5 years Child dies in Swimming pool

స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ అపస్మారకస్థితి లోకి వెళ్లిం దో చిన్నారి. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్వాల్‍  సీఐ మట్టయ్య కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరం ఓల్డ్ అల్వాల్ ఫాదర్ బాలయ్య నగర్ కు చెందిన దేవేందర్ రావు కూతురు ఆధ్యా రావు(5)..సూర్య నగర్ లోని వీవీ స్పోర్స్ట్  అకాడమీ స్విమ్మింగ్ పూల్ లో ఈ నెల 20 వ తేదీన సాయంత్రం ఈతకు వెళ్లిం ది. ఈత కొడుతుండగా నీళ్లలో మునిగి  అపస్మారక స్థితి లోకి వెళ్లింది. రెస్ట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం ఉదయం పాప మృతి చెందింది. చిన్నారి ఆద్యారావు కొంపల్లిలోని ఓ ప్రయివేట్ స్కూల్ లో ఫస్ట్ క్లాస్ చదువుతోంది.

కేర్ టేకర్‍ లేకనే..

ఆద్యా రావు కొన్ని రోజులుగా స్విమ్మింగ్ నేర్చుకుంటోంది. డాన్స్ క్లాస్ కూడా వెళ్తోంది. ఈనెల 20న న డ్యాన్ స్ క్లాస్‍ నుంచి ఆలస్యం గాఇంటికి వచ్చిం ది. స్విమ్మింగ్ కు కూడా వెళ్తానని పట్టుపట్టి తన తల్లితో కలిసి వెళ్లిం ది. సమయం అయిపోయినందున నిర్వాహకులు అనుమతి నిరాకరించారు. అయినా వారిని అభ్యర్థిం చి స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లారు. తల్లి వాష్ రూమ్ కు  వెళ్లి వచ్చేసరికి బిడ్డ కనిపించలేదు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్విమ్మింగ్ పూల్  కోచ్ అక్కడికి వచ్చి పూల్ లో ఆద్యా రావును గుర్తించి బయటకు తీశాడు. అప్పటికే చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది. స్విమింగ్  చేసే సమయంలో కేర్ టేకర్ లేకనే చిన్నారి నీళ్లు మింగడంతో ఈపరిస్థితి తలెత్తింది. స్థానిక  ప్రయివేటు హాస్పిటల్లో చేర్పించి చికిత్స ఇస్తుండగా బుధవారం చనిపోయింది. పాప తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మట్టయ్య తెలిపారు. స్విమ్మింగ్ పూల్  యజమాని,కోచ్ లపై పలు సెక్షన్ల కిందకేసు నమోదు చేశామని చెప్పారు.

Latest Updates