50లో.. 20ల్లా ..

 మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తేనే మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతుంది, దాంతో ఏకాగ్రత పెరుగుతుంది అంటున్నారు పరిశోధకులు. రోజూ కొత్త కొత్త పజిళ్లు పూరిస్తూ ఉంటే.. మెదడులోని నాడీకణాల మధ్య అనుసంధానం బలంగా ఉంటుంది. తద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు మందగించే సమస్య తగ్గిపోతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. విద్యను అభ్యసించడం, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండడం వల్ల కూడా మెదడు చురుగ్గా ఉంటుంది.

రోజూ కొత్త కొత్త పజిళ్లను, కాస్త క్లిష్టమైన పజిళ్లను పూరిస్తూ ఉండాలి. ముఖ్యంగా 50 ఏళ్ల వయసుకు వచ్చినవారు ఇలా చేయడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. దీంతో పాటు రోజూ 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వ్యాయామం శ్రమ చేసేవారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చారు. శరీరంలో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి వాటికి కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి.. మెదడుపై ఒత్తిడి తగ్గుతుందని వారు చెబుతున్ నారు. ఇక ధూమపానం, ఆల్కహాల్ వంటి అలవాట్ల కారణంగా.. శరీరంలో రక్తనాళాలు దెబ్బతినడం, హానికర రసాయనాలు చేరడం, అవి మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. అందువల్ల పొగతాగడానికి, ఆల్కహాల్ కు దూరంగా ఉంటే యాభై లో కూడా ఇరవైల్లో పనిచేసినట్టే మెదడు పని చేస్తుంది అంటున్నారు న్యూరాలజిస్ట్‌‌‌‌లు.

Posted in Uncategorized

Latest Updates