50 ఏళ్ల వయసులో కవల పిల్లలు.. IVFకి పెరుగుతున్న డిమాండ్

IVS TREATMENTIVF. ఇన్ విట్రో  ఫెర్టిలైజేషన్. కృత్రిమ సంతాన సాఫల్యత. సంతానం లేనివారికి కొత్త దారి చూపిస్తున్న పద్ధతి. ప్రపంచవ్యాప్తంగా IVFకు డిమాండ్ పెరుగుతోంది. సక్సెస్ రేటూ పెరుగుతోంది. ఇది తెలుసుకున్న ఓ పంజాబీ జంట… IVF ద్వారా సంతానం పొందింది. కవల పిల్లలకు జన్మనిచ్చిందామె. అదీ 50 ఏళ్ల వయసులో. లుథియానాలోని రాణా హాస్పిటల్ లో జరిగిందీ అద్భుతం. పంజాబ్ కు చెందిన సుఖ్విందర్ కౌర్ అనే మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. నిజానికి సుఖ్విందర్ కౌర్ కు ఇద్దరు కొడుకులుండేవారు.

పదిహేనేళ్ల క్రితం ఇద్దరూ కరెంట్ షాక్ తో చనిపోయారు. దాంతో పిల్లలు లేని లోటు తీర్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి IVF ద్వారా పిల్లల్ని పొందొచ్చని తెలుసుకుని రాణా హాస్పిటల్ ను సంప్రదించారు. పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో సుఖ్విందర్ కౌర్ నిన్న రాత్రి ట్విన్స్ కు జన్మనిచ్చింది. కౌర్ వయసు 50… ఆమె భర్త వయసు 65. ఇంత లేట్ ఏజ్ లోనూ పిల్లల్ని కనడం వండరే అంటున్నారు డాక్టర్లు. తల్లీ-బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates