లలితా జువెలర్స్ లో దొంగతనం..

లలితా జువెలర్స్ లో దొంగతనం జరిగింది. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చిలో బుధవారం పొద్దున జరిగింది. షాపు వెనకభాగంలో పెద్ద రంద్రం చేసిన దొంగలు 50కోట్ల రూపాయల విలువగల నగలను ఎత్తుకుపోయినట్లుగా పోలీసులు తెలిపారు.  ఇద్దరు దొంగలు జంతువుల ముసుగులు వేసుకుని దొంగతనం చేసినట్లు సీసీకెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటన మంగళవారం రాత్రి 2 నుంచి 3 గంటల మద్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తిరుచ్చి పోలీస్ కమిషనర్ ఏ. అమల్ రాజ్, సెంట్రల్ జోన్ ఐజీ వరదరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఫోరెన్సిక్ టీం క్లూస్ సేకరించినట్లు తెలిపారు పోలీసులు. తిరుచ్చిలో ఇది రెండవ పెద్ద దొంగతనం. మొదటిది పంజాబ్ నేషనల్ బ్యాంకులో జనవరిలో జరిగిన దొంగతనంలో రూ. 19లక్షల నగదు, 470 బంగారు బిళ్లలను దొంగతనం జరిగింది.

Latest Updates