నీళ్లు, కరెంట్ బిల్లుల్లో 50% డిస్కౌంట్

జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఏడాది పాటు బంపర్ ఆఫర్

రూ. 1,350 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన గవర్నర్ ఎల్జీ మనోజ్ సిన్హా

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్​లో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా కుదేలైన వ్యవసాయం, బిజినెస్, టూరిజం, ఇండస్ట్రీస్ వంటి సెక్టార్లు తిరిగి పుంజుకునేందుకు వీలుగా రూ. 1,350 కోట్ల ఎకనమిక్ రిలీఫ్​ ప్యాకేజీని అమలు చేయనున్నట్లు శనివారం లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. రైతులు, సాధారణ ప్రజలు, వ్యాపారులు, ఇతరులకు ఏడాది పాటు నీళ్లు, కరెంట్ బిల్లుల్లో 50% డిస్కౌంట్ ఇస్తామని  వెల్లడించారు. ఈ డిస్కౌంట్​తో చిన్న, మధ్యతరహా సంస్థలతో పాటు టూరిజం ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుందన్నారు. ప్రధాని మోడీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీకి అదనంగా ఈ ప్యాకేజీ ఉంటుందన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకూ స్టాంపు డ్యూటీని మినహాయిస్తున్నామని చెప్పారు. గతేడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్రంగా నష్టపోయిన ఇండస్ట్రియల్ సెక్టార్ పుంజుకునేలా త్వరలో కొత్త పాలసీ ప్రకటిస్తామన్నారు. ట్యాక్సీ డ్రైవర్లు, ట్రాన్స్ పోర్టర్లు, ఆటో రిక్షా డ్రైవర్లు, హౌజ్ బోట్ ఓనర్లు, రిక్షావాలాలు, ఇతరులకు కూడా ప్యాకేజీ ప్రకటిస్తామని మనోజ్ సిన్హా చెప్పారు. రుణాలు తీసుకున్న వ్యాపారులకు షరతులు లేకుండా 6 నెలల పాటు 5 % వడ్డీ రాయితీ ఇస్తామన్నారు. చేనేత, చేతివృత్తుల పరిశ్రమల్లోని వారికి క్రెడిట్ కార్డ్ స్కీం కింద మ్యాగ్జిమమ్ లిమిట్​ను లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచి, 7% వడ్డీ రాయితీ ఇస్తామన్నారు. అలాగే అక్టోబర్ 1 నుంచి జమ్మూకాశ్మీర్ బ్యాంక్ యువ, మహిళా వ్యాపారవేత్తల కోసం స్పెషల్ డెస్క్ ను ప్రారంభిస్తుందన్నారు.

For More News..

2 వేల నోట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలే

పాలకమండళ్లు లేని ప్రఖ్యాత దేవాలయాలు

రెండేళ్లు గడిచినా ‘కంటి వెలుగు’ల్లేవ్‍.. స్టోర్‍ రూముల్లోనే అద్దాలు..

Latest Updates