వైద్య, పారిశుధ్య సిబ్బందికి 50 లక్షల భీమా

కేంద్రం ప్ర‌క‌టించిన భారీ ప్యాకేజీ ఉపాధి హామీ కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు పెద్ద ఉపశమనం అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్. కరోనా క‌ట్ట‌డి క్ర‌మంలో కేంద్రం ప్రక‌టించిన‌ ఈ ప్యాకేజి వలన పేద, మధ్య తరగతి ,దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన 99 శాతం కుటుంబాలకు లబ్ది చేకూరుతుంద‌న్నారు. క్లిష్ట సమయంలో 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించి పేదల పెన్నిధి అని మోడీ మరోసారి రుజువు చేసుకున్నార‌ని తెలిపారు బండి సంజ‌య్.

ఆపద సమయంలో పేదలకు అండగా నిలిచిన మోడీ గారికి ధన్యవాదాలు, శత కోటి నమస్కారాలన్నారు.
ఈ ప్యాకేజి రైతులకు, పేద ప్రజలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, గృహిణులకు పెద్ద ఊరటనిస్తోందని చెప్పారు. చిరు ఉద్యోగుల ఉద్యోగాలను కాపాడేందుకు కోసం మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్న బండి సంజ‌య్.. మోడీ రాజ్యంలో ఆకలి బాధలకు స్థానం లేదన్నారు. ఈ ప్యాకేజీ వలన రాష్ట్రంలో ఉన్న 87 లక్షల కుటుంబాలకు, 3 కోట్ల మంది పేదలకు ఆకలి బాధలు తప్పుతాయని తెలిపారు.పేద ప్రజల ఇబ్బం దులు తెలిసిన వ్యక్తిగా మోడీ ఈ ప్యాకేజిని రూపొందించారని తెలిపారు.

కరోనాను ముందువరుసలో ఎదుర్కుంటున్న వైద్య, పారిశుధ్య సిబ్బందికి మోడీ అందించిన 50 లక్షల భీమా భరోసానిస్తుందన్నారు. ఈ ప్యాకేజి వలన రాష్ట్రంలో 59 లక్షల మంది జాబ్ కార్డులన్న ఉపాధి హామీ కూలీలకు, ఉజ్వల గ్యాస్ పొందిన 9.36 లక్షల కుటుంబాలకు, 45 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళల కు, 5.5లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు, 50లక్షల మందిరైతులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్ష‌డు బండి సంజ‌య్.

Latest Updates