ఎంసెట్‌, నీట్‌, జేఈఈ విద్యార్థుల కోసం 50 ఆన్ లైన్ మాక్ టెస్ట్స్

హైదరాబాద్‌: జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్‌, ఎంసెట్‌-2020 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఆన్ లైన్ మోక్ టెస్ట్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్ కే. లలిత్ కుమార్ తెలిపారు. దీని ద్వారా ప్రతి విద్యార్థి 50కి పైగా మాక్‌ టెస్ట్‌లు రాయవచ్చని పేర్కొన్నారు. ఇందులో ప్రతి ప్రశ్నకు వివరణతో పాటు కీ కూడా అందుబాటులో ఉంచినట్టు లలిత్ కుమార్ తెలిపారు. అలాగే, ప్రతి విద్యార్థి ఆలిండియా ర్యాంక్‌ను చూసుకోవడంతో పాటు టాప్‌ 10 ర్యాంకర్లతో సరిపోల్చుకొనేలా రిపోర్టులు కూడా ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ టెస్ట్స్ కోసం ‘Link’ అని టైప్ చేసి 98490 16661 వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చెయ్యాలని సూచించారు.

Latest Updates