ఒకే రోజు 55 క‌రోనా కేసులు.. అందులో 50 మంది ఢిల్లీ వెళ్లొచ్చినోళ్లే

దేశంలో ఒక్క‌సారిగా క‌రోనా భ‌యాన్ని తార‌స్థాయి పెంచేసింది ఢిల్లీ నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ స‌ద‌స్సు ఘ‌ట‌న‌.
ఆ మ‌త ప‌ర‌మైన‌ స‌మావేశాల‌కు వెళ్లి వ‌చ్చిన వారికి భారీ సంఖ్య‌లో వైర‌స్ సోకింది. ఈ నేప‌థ్యంలో అక్క‌డి వెళ్లి తిరిగి వ‌చ్చిన వారిని గుర్తించే ప‌నిలో ప‌డ్డాయి రాష్ట్ర ప్ర‌భుత్వాలు. త‌మిళనాడులో ఇవాళ ఒక్క‌రోజే 55 క‌రోనా కేసులు న‌మోదు కాగా, అందులో 50 మంది ఢిల్లీలో జ‌రిగిన ఆ మ‌త స‌ద‌స్సుకు హాజ‌రై వ‌చ్చిన వారేన‌ని తెలిపారు త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి బీలా రాజేశ్. ఐదుగురు మాత్ర‌మే ఇత‌ర కేసుల‌న్నారు.
త‌మిళ‌నాడు నుంచి ఈ స‌మావేశాల‌కు 1500 మంది వెళ్లార‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి బీలా రాజేశ్ తెలిపారు. అందులో 1130 మంది రాష్ట్రానికి తిరిగి రాగా.. మిగిలిన వాళ్లు ఢిల్లీలోని ఉన్నార‌ని చెప్పారు. అయితే 1130 మందిలో 515 మందిని మాత్ర‌మే గుర్తించ‌గ‌లిగామ‌ని, మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు. ఢిల్లీ మ‌ర్క‌జ్ మ‌త ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న వారంద‌రికీ క‌రోనా టెస్టులు చేస్తామ‌ని బీలా తెలిపారు. అక్క‌డికి వెళ్లి వ‌చ్చిన వారిలో 50 మందికి క‌రోనా ఉన్న‌ట్లు మంగ‌ళ‌వారం గుర్తించామ‌ని వివ‌రించారామె. దీంతో త‌మిళ‌నాడులో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 124కు చేరింద‌ని తెలిపారు.

Latest Updates