50% ఫీజులు తగ్గించాలి : ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి

కరోనా కష్టకాలంలో ఫీజుల కోసం త‌మ‌ని వేధించ‌వ‌ద్దంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టు జి. హనుమంతరావు ఆధ్వర్యంలో విద్యాహక్కు చట్టం, పేరెంట్స్ కమిటీ అమలుపై త‌ల్లిదండ్రుల‌తో స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ విద్యార్ధుల త‌ల్లిదండ్రులు మాట్లాడుతూ క‌రోనా క‌ష్ట‌ కాలంలో ఉద్యోగాలు లేకుండా తీవ్ర ఇబ్బందులుప‌డుతున్న‌ట్లు చెప్పారు. సగం జీతాలతో కుటుంబాన్ని పోషిస్తున్నామ‌ని, కానీ స్కూల్ యాజమాన్యం ఫీజుల కోసం ఒత్తిడి చేయటం సరికాదన్నారు. ఈ ఏడాది ట్యూషన్ ఫీజులో సగం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆన్ లైన్ తరగతులకు ఇంటర్ నెట్, ప‌వ‌ర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ఈ సమస్య వ‌చ్చిన మరుసటి రోజు పిల్లలకు క్లాస్, నోట్స్ ఇవ్వాలని కోరారు. చదువుతో పాటు ఆటల కోసమని జాయిన్ చేస్తే… స్కూల్ యాజమాన్యం పట్టించుకోవ‌డం లేద‌న్నారు.

అనంత‌రం జర్నలిస్టు హ‌నుమంతురావు మాట్లాడుతూ మరోసారి ప్రైవేటు పాఠశాలల తల్లిదండ్రులతో సమావేశమై స్కూల్ యాజమాన్యానికి వినతిపత్రం దజేస్తామన్నారు.విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలపై యాజమాన్యం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం, విద్యాశాఖ చర్యలు చేపట్టాలని కోరారు.

Latest Updates