వెబ్ సైట్ లో 50% సబ్సిడీతో రైలు టికెట్లు

రైలు ప్రయాణాల్లో సబ్సిడీ పొందే ప్రయాణికులకు IRCTC ఓ సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటి వరకూ ఈ సబ్సిడీ కావాలంటే తప్పని సరిగా టికెట్ బుకింగ్ కౌంటర్ల దగ్గరకు వెళ్లాల్సి ఉండేది. అయితే ఇకపై IRCTC వెబ్ సైట్ ద్వారా కూడా పొందవచ్చు. 58 ఏళ్లు పైబడిన మహిళలకు టికెట్ ధరల్లో 50%,60 ఏళ్లు పైబడిన పురుషులకు 40% రాయితీని అన్ని రకాల ప్రయాణాల్లోనూ కల్పిస్తోంది. అయితే ఈ సబ్సిడీ పొందాలనుకునే వారు జర్నీ టైంలో ఏజ్ సర్టిఫికెట్ తప్పకుండా వెంట తీసుకురావాల్సి ఉంటుంది.