ప్రతిరోజూ 50వేల కరోనా పరీక్షలు చేయాలి

ప్రతిరోజూ 50వేల కరోనా పరీక్షలు చేయాలి

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ICMR మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. కరోనా కేసులు ఎక్కువ వచ్చే ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రతీ రోజూ 50 వేల RTPCR టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయని..స్కూలు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని పిటిషనర్ తరఫు లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రోజూ 50వేల పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నెల 7, 11, 12, 13 తేదీల్లో వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లలో 50వేల పరీక్షలు నిర్వహించినట్లు లేదన్నారు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని కోరారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ప్రతిరోజూ బులెటిన్ విడుదల చేస్తున్నామని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.