ఒంటి గంట వరకు 51.38% పోలింగ్ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది.120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 51.38% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ కార్పొరేషన్ లో 49 శాతం, జవహర్ నగర్ కార్పొరేషన్ లో 35 శాతం పోలింగ్ జరిగింది, నిజాంపేట కార్పొరేషన్ లో 27 శాతం , పీర్జాదిగూడ కార్పొరేషన్ లో 46 శాతం పోలింగ్ నమోదైంది. బాన్సువాడ మున్సిపాలిటీలో 61 శాతం పోలింగ్ జరిగింది. జమ్మికుంట 61, హుజురాబాద్ 62 శాతం పోలింగ్ జరిగింది. కొత్తపల్లి 61, చొప్పదండిలో 58, మెట్ పల్లి 50, కోరుట్ల 53 శాతం పోలింగ్ జరిగింది. గుండ్ల పోచంపల్లి 58, తూముకుంటలో 51 శాతం పోలింగ్ జరిగింది. మంథని 65, సుల్తానాబాద్ 63, పెద్దపల్లి 57 శాతం నమోదైంది. ఆదిబట్ల 73, తుక్కుగూడ 62 శాతం పోలింగ్ తొర్రూరు 53, జనగామ 55 శాతం పోలింగ్ చండూరు 60, చౌటుప్పల్ 69 శాతం పోలింగ్ జరిగింది.

 

Latest Updates