ఢిల్లీ అల్లర్లు: చనిపోయిన ఐబీ ఆఫీసర్ బాడీపై 51 గాయాలు

ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ తీవ్ర రక్తస్రావం కారణంగానే చనిపోయినట్లు ఫోరెన్సిక్ వైద్యులు తేల్చారు. అల్లరిమూకల దాడిలో అంకిత్ శర్మ ఊపిరితిత్తులకు మరియు మెదడుకు తీవ్ర గాయాలయ్యాయని వారు తెలిపారు. అందరూ అనుకున్నట్లు అతని శరీరంలో 400 కత్తి పోట్లు లేవని కూడా స్పష్టం చేశారు. అతని శరీరంపై 51 గాయలను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అందులో 12 గాయాలు కత్తుల వల్ల అయ్యాయని, మరో 33 గాయాలు రాడ్డు వంటి వాటి వల్ల అయ్యాయని వారు తెలిపారు. అంకిత్ శర్మ తొడ, కాళ్లు, మరియు అతని శరీరం వెనుకవైపు బలమైన గాయలైనట్లు వారు తెలిపారు. ఈ గాయాల వల్లే తీవ్ర రక్తస్రావం జరిగి అంకిత్ చనిపోయినట్లు వారు నిర్దారించారు.

ఫిబ్రవరి 27న ఈశాన్య ఢిల్లీలోని చాంద్‌బాగ్ ప్రాంతంలోని ఒక మురికి కాలువలో అంకిత్ శర్మ మృతదేహం దొరికింది. అంకిత్‌ను ఆప్ పార్టీ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ చంపాడని అతని తల్లిదండ్రులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు తాహీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఆప్ అధినేత కేజ్రీవాల్.. తాహీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

For More News..

షాకింగ్ న్యూస్: పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 పెంపు

భారత్‌లో కరోనా వల్ల రెండో మృతి

చెట్లు నరికితే జైలుకే

మైక్రోసాఫ్ట్‌కు బిల్‌గేట్స్ రాజీనామా

కరెంట్ చార్జీలు పెరిగితే భరించాలే

Latest Updates