3 నియోజకవర్గాల్లో 53 నామినేషన్ల తిరస్కరణ

లోక్ సభ ఎన్నికలలో భాగంగా హైదరాబాద్‍ పార్లమెంటరీ నియోజకవర్గా నికి దాఖలైన నామినేషన్ల స్ర్కూటినీ పూర్తయినట్లు హైదరాబాదు ఎన్నికలరిటర్నింగ్‌‌ అధికారి మాణిక్‌‌ రాజ్‌ కన్నన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని చెప్పా రు. 19 మంది అభ్యర్థుల నామినేషన్లునిబంధనల మేరకు సరిగ్గా ఉండటంతో స్వీ కరించి నట్లు తెలివారు. ఐదుగురి నామినేషన్లను తిరస్కరించి నట్లు రిటర్నింగ్‌‌ అధికారి మాణిక్ రాజ్​ కన్నన్​వివరించారు. అలాగే సికిం ద్రాబాద్‍ లోక్ సభ స్థానాని కి దాఖలైన నామినేషన్ల స్ర్కూటినీ పూర్తయినట్లు ఆ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌‌ అధికారి గుగులోతు రవి తెలిపారు. మొత్తం51 నామినేషన్లు రాగా 21 నామినేషన్లు రిజెక్ట్ చేసినట్లు,30 నామినేషన్లు ఆమోదించి నట్లు వివరించారు.మల్కా జిగిరి స్థానాని కి దాఖలైన నామినేషన్ల స్ర్కూటినీ పూర్తయినట్లు ఆ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌‌ అధికారి ఎంవీరెడ్ డి తెలిపారు.40 మంది 62 నామినేషన్లు వేయగా27 మందికి సంబంధించి న నామినేషన్లు రిజెక్ట్ చేసినట్లు 13 మంది నామినేషన్లను ఆమోదించి నట్లు చెప్పా రు.

 

Latest Updates