ఫ్లాట్​లో ఒంటరిగా ఉన్న మహిళపై రేప్

  • మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో దారుణం

భోపాల్: మధ్యప్రదేశ్​లో ఓ మహిళా బ్యాంక్ మేనేజర్ పై గుర్తుతెలియని వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన ఫ్లాట్ లో ఒంటరిగా ఉన్న ఆమెపై శుక్రవారం తెల్లవారుజామున అత్యాచారానికి పాల్పడ్డాడు. విజువల్లీ హ్యాండీక్యాప్డ్ అయిన 53 ఏళ్ల వయసున్న ఆమె గవర్నమెంట్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆమె భర్త తన సొంతూరు అయిన రాజస్థాన్ లోని సిరోహి జిల్లాకు వెళ్లి లాక్​డౌన్ కారణంగా అక్కడే ఇరుక్కుపోయాడు. దీంతో కొద్దిరోజులుగా ఆమె ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్ మెంట్​లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడు మెట్ల మీద నుంచి వెళ్లాడని, ఓపెన్ చేసి ఉన్న బాల్కనీ డోర్స్ నుంచి మహిళ ఇంట్లోకి ప్రవేశించినిట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

Latest Updates