6 నెలల చిన్నారికి కరోనా : క్వారంటైన్ లోకి 18 మంది డాక్టర్లు, 36 మంది సిబ్బంది

చండీఘడ్ లో 18మంది డాక్టర్లు, 36 మంది క్వారంటైన్ లోకి వెళ్లారు. పంజాబ్ ఫగ్వారాకు చెందిన 6నెలల పసికందుకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో చిన్నారిని అత్యవసర చికిత్సకోసం పీడియాట్రిక్ సెంటర్ లో జాయిన్ చేయించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం ట్రీట్ మెంట్ కోసం చిన్నారిని 36 రోజులపాటు లూధియానాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచారు.  ఆపరేషన్ తరువాత పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పిజిఐఎంఆర్) తరలించారు.  తాజాగా ఆ చిన్నారికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో పీజీఐఎంఆర్  డాక్టర్లు టెస్ట్ లు చేశారు. ఈ టెస్టుల్లో చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో పీజీఐఎంఆర్ కు చెందిన డాక్టర్లు, సిబ్బంది క్వారంటైన్ లోకి వెళ్లారు.

పీజీఐఎంఆర్ హెల్త్ బులిటెన్ విడుదల

ఏప్రిల్ 21న చిన్నారికి కరోనావైరస్ లు టెస్ట్ లు చేశామని, ప్రస్తుతం వెంటిలేటర్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు పీజీఐఎంఆర్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

చిన్నారికి కరోనా ఎలా సోకిందో

చిన్నారికి కరోనా ఎలా సోకిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.  పిజిఐ లో జాయిన్ అయిన తరువాత సోకిందా లేదంటే చిన్నారి కుటుంబ సభ్యులకు కరోనా సోకిందా అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నట్లు పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పిజిఐఎంఆర్) వైద్యులు తెలిపారు.

Latest Updates