55 వేల మంది డ్రైవర్లకు ఉబర్ సాయం

కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన డ్రైవర్లలో 55 వేల మందికి ఉబర్ కేర్ ఫండ్ ద్వారా ఆర్ధిక సాయం చేశామని ఆ కంపెనీ ప్రకటించింది. మొదటి బ్యాచ్ డ్రైవర్ల కు రూ.25 కోట్లు అందించామని తెలిపింది. ఫండ్ కోసం అదనంగా రూ. 25 కోట్లు సేకరించాలని ఉబర్ ఇది వరకే దాతలను కోరింది. దీంతో 23 వేల మందికి పైగా ఉబర్ రైడర్స్, ఉద్యోగులు ఇప్పటికే రూ.2.15 కోట్లు అందించారు. తదుపరి బ్యాచ్ డ్రైవర్లకు పంపిణీ చేయడానికి ఎన్జీఓలు, కార్పొరేషన్లు అదనంగా రూ.4.28 కోట్లను ఇప్పటికే డ్రైవర్ ఫండ్ లో జమ చేశాయి. ఈ సందర్భంగా ఉబర్ ఇండియా, దక్షిణాసియా కే కేంద్ర కార్యకలాపాల విభాగం చీఫ్ పవన్ వైష్ మాట్లాడుతూ త్వరలో డ్రైవర్ ఫండ్ ద్వారా మరింత మందికి సాయం చేయబోతున్నామని వెల్లడించారు. గివ్ ఇండియా, సంహిత అనే ఎన్జీఓల సాయంతో ఈ ఫండ్ కు నిధులను సమకూర్చుకున్నామని పవన్ వైష్ చెప్పారు.

Latest Updates