ఒకే రోజు 56,282 కరోనా కేసులు..904 మంది మృతి

భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.;ప్రతి రోజు 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 56,282 కరోనా కేసులు నమోదవ్వగా 904 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19,64,537కు చేరగా మరణాల సంఖ్య 40,699 కు చేరింది. ఇక 5,95,501 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా 13,28,337 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 6,64 ,949 కరోనా టెస్టులు చేశారు. దీంతో దేశంలో ఆగస్టు 5 వరకు కరోనా టెస్టుల సంఖ్య 2,21,49,351 కు చేరింది

Latest Updates