57 వజ్రాలతో ముక్కుపుడక : దుర్గమ్మ మొక్కు చెల్లించిన సీఎం కేసీఆర్

kcr-durgammaబెజవాడ కనకదుర్గమ్మకు మొక్కు తీర్చుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ వస్తే అమ్మవారికి ముక్కు పుడుక చేయిస్తానని మొక్కిన విషయం తెలిసిందే. జూన్ 28వ తేదీ గురువారం కుటుంబ సభ్యులతో ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పూజారులు.. ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత  సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ముక్కు పుడకను అందజేశారు. వారి ఎదుటే ఆ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించారు పూజలు.

బంగారం, రత్నాలు, వజ్రాలతో కూడిన.. అర్ధచంద్రాకారం, పాలపిట్టతో ఉన్న 11.29 గ్రాములు ఉంది ముక్కు పుడుక. ఇందులో 57 వజ్రాలు ఉన్నాయి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో విజయవాడకు రావడం ఇది ఐదోసారి. ఏపీ మంత్రి దేవినేని ఉమ వెంటే ఉన్నారు. ఎయిర్ పోర్ట్ దగ్గర స్వాగతం పలికిన ఆయన ఆలయంలో దర్శనం, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేసీఆర్ కుటుంబంతోపాటు ఏంపీ కేకే, మంత్రులు నాయినీ, ఇంద్రకరణ్ రెడ్డి, కూడా ఉన్నారు.

కేసీఆర్ కు ఘన స్వాగతం :

సీఎం కేసీఆర్ బెజవాడ వస్తున్న సందర్భంగా.. ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. సిటీ అంతా కేసీఆర్ ఫ్లెక్సీలతో నింపేశారు. బ్యానర్లు కట్టారు. దారి పొడవునా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆలయం దగ్గర కేసీఆర్ ను శాలువాతో సత్కరించారు అభిమానులు. మొక్కుల సందర్భంగా ఇప్పటికే తిరుమల శ్రీవారు, వరంగల్ భద్రకాళీ అమ్మవారికి, కొమరవెల్లి మల్లన్నకి బంగారు మీసాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు కేసీఆర్..

Posted in Uncategorized

Latest Updates