భారత సైన్యంలో 575 మంది జమ్మూకశ్మీర్ యువత

జమ్మూకశ్మీర్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన 575 మంది యువకులు ఇవాళ(శనివారం) ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీలోకి వీరిని తీసుకున్నారు అధికారులు. శ్రీనగర్ లో శనివారం జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ లో వీరు విధుల్లో చేరారు. మాతృదేశానికి సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, విధుల్లో భాగంగా ప్రాణాలను అర్పించేందుకు కూడా సిద్ధమేనని వారు చెప్పారు. భారత సైన్యంలో భాగస్వాములు కావడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీని 1947లో ఏర్పాటు చేశారు. పొరుగుదేశం నుంచి చొరబడేవారిని ఎదుర్కొనేందుకు ఈ వింగ్ ను ఏర్పాటు చేశారు.

 

Latest Updates