5G టెక్నాలజీ గురూ : గాల్లో తేలుతూ పెళ్లికి వచ్చారు

పెళ్లంటే నూరేళ్ల పంట. గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటారు దంపతులు. ఇందుకోసం పెళ్లికోడుకును ఊరేగింపుగా గుర్రంమీదనో..పల్లకిలోనో..కారులోనో తీసుకురావడం కామన్. అయితే వెరైటీగా ఉండాలనుకున్నారు ఆ దంపతులు. టెక్నాలజీ పుణ్యామా అని వినూత్నంగా ఆలోచించారు. అందరిచేత వాహ్ అనిపించుకుంటున్నారు. పెళ్లి వేడుకను ఓ కొత్త జంట వినూత్నంగా నిర్వహించారు. కళ్యాణ వేదిక వద్దకు పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఎలక్ట్రిక్ పంజరంలో ఆకాశంలో నుంచి వచ్చారు. ఎలక్ట్రిక్ పంజరంలో ఉన్న ఆ కొత్త జంటను ఓ గద్ద ఆకాశం నుంచి కళ్యాణ మండపానికి తీసుకొచ్చింది.

ఈ పెళ్లి వేడుక శనివారం రాత్రి (జూలై-14) ముంబైలో జరిగింది. విద్యుత్ కాంతులతో మెరుస్తూ ఆకాశం నుంచి వినూత్న రూపంలో పెళ్లి వేదిక వద్దకు వస్తున్న కొత్త జంటను పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ కొత్త జంటను క్రేన్ సాయంతో పెళ్లిపీటల వద్ద తీసుకొచ్చారు. ఆహా పెళ్లంటా ఇలా చేసుకోవాలంటూ కామెంట్ప్ చేస్తున్నారు నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates