కనిపించని కెమెరాతో ఫొటోలు

టెక్నాలజీ రోజురోజుకూ మారుతోంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో స్మార్ట్ ‌‌ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌లు రిలీజ్ ​అవుతున్నాయి.  ఈ ఏడాది కూడా కొన్ని ఇంట్రెస్టింగ్‌‌ టెక్నాలజీ ఫోన్లు రాబోతున్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్‌‌ టెక్నాలజీ అప్‌‌డేట్స్‌‌…

స్నాప్‌‌డ్రాగన్‌‌ 888

స్మార్ట్‌‌ఫోన్ ప్రాసెసర్స్‌‌లో ఈ ఏడాది లేటెస్ట్‌‌ వెర్షన్‌‌ అయిన, ‘క్వాల్‌‌కామ్‌‌ స్నాప్‌‌డ్రాగన్‌‌ 888’ చిప్‌‌సెట్‌‌ ట్రెండ్‌‌గా మారుతుంది. కొత్తగా రిలీజయ్యే ఫ్లాగ్‌‌షిప్‌‌ ఫోన్స్‌‌ అన్నీ దాదాపు ఈ ప్రాసెసర్‌‌‌‌తో తయారైనవే ఉంటాయి. ఈ ప్రాసెసర్‌‌‌‌ 5జీని సపోర్ట్‌‌ చేస్తుంది. దీనికంటే ముందు చిప్‌‌సెట్స్‌‌తో పోలిస్తే… ఇది గ్రాఫిక్స్, పవర్‌‌‌‌ విషయంలో 25 శాతం వేగంగా పనిచేస్తుంది. 7.5జీబీపీఎస్‌‌ స్పీడ్‌‌ను సపోర్ట్‌‌ చేస్తుంది. మూడు కెమెరాల నుంచి ఒకేసారి ఫొటోలు క్యాప్చర్‌‌‌‌ చేయగలదు. సెకండ్‌‌కు 2.7 గిగాపిక్సెల్స్‌‌ క్లారిటీతో ఫొటోలు తీయొచ్చు.

ఫౌజి గేమ్‌‌

గేమ్‌‌ లవర్స్‌‌ ఎక్కువగా ఎదురు చూస్తున్న వీడియో గేమ్‌‌ ‘ఫౌ–జి (ఫియర్‌‌‌‌లెస్‌‌ అండ్‌‌ యునైటెడ్‌‌ గార్డ్స్‌‌)’ రేపే (26న) విడుదలవుతోంది. దాదాపు రెండేళ్లపాటు గేమింగ్‌‌ లవర్స్‌‌ను ఆకట్టుకున్న ‘పబ్‌‌జి’ ని ప్రభుత్వం గత ఏడాది బ్యాన్‌‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి సరైన గేమ్‌‌ కోసం ఎదురు చూస్తున్నారు యూజర్స్‌‌. పబ్‌‌జిలాంటి వేరే గేమ్స్‌‌ ఉన్నా, అవి ఆ స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ‘ఫౌ–జి’ మీద అందరి దృష్టీ ఉంది. ‘పబ్‌‌జి’ని మించి ‘ఫౌ–జి’ ఆకట్టుకునే ఛాన్స్‌‌ ఉందంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. అనుకున్న రేంజ్‌‌లో సక్సెస్‌‌ అయితే, ఇది ఈ ఏడాది కచ్చితంగా ట్రెండ్‌‌లో నిలుస్తుంది. ‘పబ్‌‌జి’కి అసలైన పోటీగా చెప్తున్న ఈ గేమ్‌‌ ఇండియన్‌‌ మేడ్‌‌ కావడం విశేషం.

మ్యాక్‌‌ ఎమ్‌‌1

యాపిల్‌‌ సంస్థ సొంతంగా తయారు చేసిన మొదటి చిప్‌‌సెట్‌‌ ‘ఎమ్‌‌1’. మ్యాక్‌‌బుక్‌‌ కోసం తయారు చేసిన ఈ చిప్‌‌సెట్‌‌ అద్భుతమైన పర్ఫామెన్స్‌‌ ఇస్తుందని యాపిల్‌‌ చెప్పింది. కంప్యూటర్‌‌‌‌ మెయిన్‌‌ కాంపొనెంట్స్‌‌ అయిన ర్యామ్‌‌, గ్రాఫిక్స్‌‌, ప్రాసెసర్‌‌‌‌.. ఇలా అన్నింటినీ ఇంటిగ్రేట్‌‌ చేసి తయారుచేసిన చిప్‌‌ ఇది. మిగతా సీపీయులతో పోలిస్తే, 3.5 రెట్లు ఎక్కువ సీపీయు పవర్‌‌‌‌తో ఉంది. ఒక వాట్ పవర్‌‌‌‌కు 3 రెట్ల పర్ఫార్మెన్స్ స్పీడ్‌‌ పెరుగుతుంది. ఈ చిప్‌‌సెట్‌‌తో వచ్చే మ్యాక్‌‌బుక్స్‌‌ ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉందంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌.

అండర్‌‌‌‌ డిస్‌‌ప్లే కెమెరాస్‌‌

ఏ స్మార్ట్‌‌ఫోన్‌‌కైనా సెల్ఫీ కెమెరా, డిస్‌‌ప్లేలో బయటికి కనిపిస్తుంది. కానీ, ‘జడ్‌‌టీఈ’  బ్రాండ్‌‌ నుంచి వచ్చిన ‘ఏక్సన్‌‌ 20’ అనే ఫోన్‌‌లో సెల్ఫీ కెమెరా బయటికి కనిపించదు. అది డిస్‌‌ప్లే లోపలే ఉంటుంది. ఫోన్‌‌ స్క్రీన్‌‌పై ఎలాంటి కెమెరా కనిపించదు. సెల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు, ఫోన్‌‌లో కెమెరా ఆన్‌‌ చేసి, సెల్ఫీ కెమెరా సెలెక్ట్‌‌ చేసుకుంటే, అప్పుడు స్క్రీన్‌‌పై కెమెరా కనిపిస్తుంది. దీన్ని అండర్‌‌‌‌ డిస్‌‌ప్లే కెమెరా అంటారు.
ప్రస్తుతానికి ‘జడ్‌‌టీఈ ఏక్స్‌‌ 20’లో మాత్రమే ఈ ఫీచర్‌‌‌‌ ఉంది. ఈ ఏడాది మరిన్ని ఫోన్లలో ఈ ఫీచర్‌‌‌‌ వచ్చే ఛాన్స్‌‌ ఉంది. ఈ ఏడాది స్మార్ట్‌‌ఫోన్స్‌‌లో ట్రెండ్‌‌గా నిలిచే ఫీచర్స్‌‌లో ‘అండర్‌‌‌‌ డిస్‌‌ప్లే కెమెరా’ కూడా ఒకటి అంటున్నారు నిపుణులు.

5జీ టెక్నాలజీ

స్మార్ట్‌‌ఫోన్‌‌ యూజర్స్‌‌ కోసం ఈ ఏడాది అందుబాటులోకి రానుంది ‘5జీ’ టెక్నాలజీ. ఇప్పటికే కొన్ని దేశాల్లో 5జీ సర్వీసెస్‌‌ స్టార్ట్‌‌ అయ్యాయి. మన దేశంలో మాత్రం ఈ ఏడాది చివరికల్లా మొదలయ్యే ఛాన్స్‌‌ ఉంది. 5జీ నెట్‌‌వర్క్‌‌ అందుబాటులోకి వస్తే, ఇంటర్నెట్‌‌ స్పీడ్‌‌ మరింత పెరుగుతుంది. 10 జీబీపీఎస్‌‌ వరకు నెట్‌‌ స్పీడ్‌‌ ఉంటుంది. ఈ సర్వీస్‌‌ వాడాలంటే 5జీ సపోర్ట్‌‌ చేసే ఫోన్స్‌‌ మాత్రమే వాడాలి. ఇప్పటికే 5జీ ఫోన్లు చాలా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోన్ల ధరలు కూడా ఇరవై వేల రూపాయల రేంజ్‌‌ నుంచి స్టార్ట్‌‌ అవుతున్నాయి. రిలయన్స్‌‌ జియో నెట్‌‌వర్క్ ఈ ఏడాది సెకండాఫ్‌‌లో నెట్‌‌వర్క్‌‌ లాంఛ్‌‌ చేస్తామని అనౌన్స్‌‌ చేయగా, మిగతా నెట్‌‌వర్క్స్‌‌ కూడా 5జీ సేవలకు రెడీ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

రేటింగ్స్ ఫిక్స్ చేయడానికి అర్నాబ్ నాకు డబ్బులిచ్చారు

టొమాటోలు… ఆరు నెలలు దాచుకోవచ్చు

డీ ఈ మేకప్​ లుక్​తో మెస్మరైజ్ చేస్తున్న దిశా పటానీ

 

 

 

Latest Updates