6నెలలు రాష్ట్రమంతా పర్యటన : ఖచ్చితంగా పార్టీ పెడతానన్న గద్దర్

ఖచ్చితంగా   పార్టీ పెడతానని  ప్రకటించారు  ప్రజా గాయకుడు  గద్దర్.  ఆరు నెలలు  రాష్ట్రమంతటా  తిరుగుతానని  చెప్పారు.  రాజకీయాలలో  కొత్త రూపం  రావాలన్నారు.  ప్రతి  కుటుంబంలో  ఒక ఓటు  …తనకు వేయాలని  కోరారు. మేధావులు  ఆలోచన  చేయాల్సిన  అవసరముందన్నారు.  ప్రజల నిర్ణయం  మేరకే రాజకీయాల్లోకి  వస్తున్నానని  చెప్పారు.  ఆగస్ట్ లో  పార్టీ నిర్మాణం,  భవిష్యత్  కార్యాచరణ  ప్రకటిస్తానంటున్నారు. పార్టీ అంటే ఏంటిదో చిరంజీవిని, అమితాబచ్చన్ ని అడుగడానికి వెళ్తానన్నారు. యువకుల కోసం తన పార్టీ పనిచేస్తుందని గద్దర్ తెలిపారు. బహుజనులు అంటే కులాలు కాదని, తినడానికి తిండి లేనోడే బహుజనుడని గద్దర్ తెలిపారు. సుందరయ్య విజ్ణాన కేంద్రంలో అభిమానులతో ఇష్ఠాగోష్ఠి నిర్వహించిన గద్దర్….దక్షిణ భారతమంతా తన ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates