6 నెలల్లో రైతు బజార్‌ నిర్మాణం పూర్తి: మంత్రి హరీశ్


రూ.10కోట్ల వ్యయంతో ఆధునిక రైతుబజార్‌ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు మంత్రి హరీశ్‌రావు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆధునిక రైతు బజార్‌కు మంత్రి హరీశ్‌రావు, మంత్రి మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 6 నెలల్లో రైతు బజార్‌ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మూడు నదుల నీళ్లు అందుతున్న నగరం హైదరాబాద్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును హైదరాబాద్ కు కూడా లింకు చేస్తామన్నారు. సిటీలో పేకాట క్లబ్బులను మూసివేయించిన ఘనత TRS ప్రభుత్వానిదన్నారు. కాంగ్రెస్ నేతలు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారన్నారు హరీశ్.

రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది నిధులతో పథకాలను అమలు చేస్తుందన్నారు మంత్రి మహేందర్‌రెడ్డి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్త మార్కెట్, రైతు బజార్ లను ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కూరగాయల సాగు చేసే రైతులకు మన కూరగాయల ఔట్ లెట్ లు జిల్లా పరిసరాల్లో 50 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇళ్ళు లేని నిరుపేదల కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లక్ష పట్టాలు, మరో లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates