జపాన్ తీరంలో భారీ భూకంపం

రిక్టర్ స్కేల్​పై 6.4 గా నమోదు

టోక్యో: జపాన్ తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 6.4 తీవ్రతతో భూకంపం వచ్చిందని యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. అయితే ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగలేదని జపాన్ ప్రభుత్వాధికారులు తెలిపారు. సునామీ హెచ్చరిక జారీ కాలేదు. జపాన్ కు చెందిన మియాగి ప్రిఫెక్చర్ తీరానికి 50 కిలోమీటర్ల లోపు పసిఫిక్ సముద్రంలో 41.7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. ఉదయం 5.30 గంటలకు తాకిన ప్రకంపనల తర్వాత సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని జపాన్ క్యోడో న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

Latest Updates