రష్యాలో భారీ భూకంపం

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 6.6 గా నమోదైంది. నార్త్ వెస్ట్ లోని నికోల్స్‌కోయికి 152కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది. కమ్చట్కా ద్వీపకల్పానికి 33 కిలో మీటర్లు దూరంలో ఈ భూకంపం రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఫసిఫిక్ మహా సముద్రానికి దగ్గరగా ఉండటంతో.. సునామీ వచ్చేలా ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే USGS సంస్థ మాత్రం సునామీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ భూకంపంతో ఎంత నష్టం జరిగిందనే దానిపై అధికారులు అంచనా వేస్తున్నారు.

Latest Updates