మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్ లో రూ.6.71 కోట్ల కుంభకోణం

మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్ లో  రూ. 6.71కోట్ల  కుంభకోణం జరిగినట్టు తేల్చారు బ్యాంక్ ఉన్నతాధికారులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల  క్రితం గోల్డ్ లోన్స్ మంజూరులో బ్యాంక్ అప్రైజర్ చేతివాటాన్ని గమనించిన బ్యాంక్ అధికారులు అంతర్గత ఆడిట్ ద్వారా కుంభకోణం జరిగినట్టు తేల్చారు. 68 మందికి చెందిన గోల్డ్ లోన్ అకౌంట్ లో మొత్తం రూ. 6,71,72000 కోట్లుగా గుర్తించారు. బ్యాంకు సిబ్బంది గోల్డ్ అప్రైజర్ మాచర్ల సత్యవర ప్రసాద రావు(64) తో కలసి బంగారు ఆభరణాలు బదులుగా నకిలీ బంగారు ఆభరణాలను బ్యాంకు లో పెట్టారని రిపోర్ట్ రెడీ చేశారు అధికారులు. బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు.

Latest Updates