వీడియో: నదిలో పడవ మునిగి ఆరుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కోటాలోని చంబల్ నదిలో 30 మంది భక్తులతో వెళ్తున్న పడవ… ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోగా.. మరో 9 మంది గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. రంగంలోకి దిగిన NDRF సిబ్బంది 15 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మిగతావారి కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. బాధితులంతా బుండి జిల్లాలోని కమలేశ్వర మహాదేవ్‌ దేవాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఓవర్ లోడ్ కారణంగానే పడవ మునిగిపోయినట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. బోట్‌లో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులతో పాటు.. కొన్ని మోటర్ సైకిళ్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

పడవ ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థికసాయం చేయాలని ఆదేశించారు.

For More News..

మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ తండ్రి మృతి

ఇజ్రాయెల్‌పై ఒకే రాత్రి 15 రాకెట్ల దాడి

మొక్కలకు ఫస్ట్​ బర్త్​డే చేసిన కార్పొరేటర్ దంపతులు

Latest Updates