వచ్చే నెల 27న ఇండియాకు రానున్న రాఫెల్ జెట్స్

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాలు ఎట్టకేలకు ఇండియాకు రానున్నాయి. రాఫెల్ ఫైటర్ జెట్స్‌లో నుంచి ఫస్ట్ బ్యాచ్ కింద కొన్ని విమానాలు వచ్చే నెల 27న ఫ్రాన్స్‌లోని ఇస్త్రీస్ నుంచి హర్యానాలోని అంబాలాకు చేరుకోనున్నాయి. ఈ డెలివరీలో నాలుగు నుంచి ఆరు ఫైటర్ జెట్స్ ఉండొచ్చని అంచనా. రాఫెల్ జెట్స్‌కు స్క్వాడ్రన్‌గా వ్యవహరించే గోల్డెన్ యారోస్ జెట్స్ ఆగస్టు నెలలో మన దేశానికి రానుందని సమాచారం.

సౌతర్న్‌ ఫ్రాన్స్‌లోని ఇస్త్రీన్‌ కమ్యూన్ నుంచి ఇండియా పైలట్లు రాఫెల్ జెట్స్‌ను ఇండియాకు తీసుకురానున్నారు. యూఏఈలోని అల్ ధప్రా ఎయిర్‌‌ బేస్‌లో ఒక్క చోట మాత్రమే ఈ జెట్స్ కొద్ది సేపు విశ్రాంతి కోసం ఆపనున్నారు. ఇండియా 36 రాఫెల్ జెట్స్ కోసం ఫ్రాన్స్‌కు రూ.59 వేల కోట్లు చెల్లించింది. అయితే ఈ ఏడాది వాటిలో నుంచి నాలుగు నుంచి ఆరు ఫైటర్ జెట్స్ మాత్రమే ఇండియాకు రానున్నాయి. మిగతా జెట్స్‌ 2022లో డెలివరీ అవుతాయి. ఈ రాఫెల్ జెట్స్‌లో రెండు స్క్వాడ్రన్‌లు ఉంటాయి. వాటిలో ఒకటి వెస్టర్న్ సెక్టార్‌‌లోని అంబాలా నుంచి ఆపరేట్ అవ్వనుండగా.. మరొకటి వెస్ట్ బెంగాల్‌లోని హసిమరా నుంచి ఆపరేట్ చేయనున్నారు.

Latest Updates