వీడియో: పుట్టిన ఆర్నెళ్లకే స్కీయింగ్ చేసి రికార్డ్‌కెక్కిన బుడతడు

నీళ్లంటే భయంతో చాలామంది యుక్తవయసు వచ్చినా ఈత నేర్చుకోరు. నీళ్లను చూస్తేనే భయపడతారు. కానీ ఓ బుడతడు మాత్రం పుట్టిన ఆర్నేళ్లకే స్కీయింగ్ చేసి రికార్డ్ సృష్టించాడు. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో కేసీ, మిండి హంఫ్రీస్ దంపతులకు ఆర్నేళ్ల వయసున్న కొడుకు రిచ్ హంఫ్రీస్ ఉన్నాడు. ఈ పిల్లాడు ఆరు నెలల నాలుగు రోజుల వయసులో లేక్ పోవెల్‌లో స్కీయింగ్ చేసి ఔరా అనిపించాడు. నీళ్లంటే ఏ మాత్రం భయలేకుండా బాలుడు స్కీయింగ్ చేస్తున్న వీడియోను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

బాలుడు స్కీయింగ్ చేస్తున్న వీడియోను అతని తల్లిదండ్రులు రిచ్ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ‘నా 6వ నెల పుట్టినరోజు సందర్భంగా నేను వాటర్ స్కీయింగ్‌కు వెళ్ళాను. నిజంగా ఇది చాలా గొప్ప విషయం … # వరల్డ్‌కార్డ్’అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. రిచ్ స్కీయింగ్ చేస్తుండగా.. అతని పక్కనే మరో బోట్‌లో రిచ్ తండ్రి మిండి ఫాలో అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు లైకులు పెరుగుతుండటంతో.. అదే వీడియోను ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. ట్విట్టర్‌లో కూడా ఆ వీడియోకు నెటిజన్ల నుంచి ఆదరణ లభించింది. చాలా మంది నెటిజన్లు రిచ్ సాహాసాన్ని మెచ్చకోగా.. మరికొంత మంది మాత్రం రిచ్ తల్లిదండ్రుల్ని తప్పుబడుతున్నారు. రిచ్ పేరు మీద నమోదైన ఈ రికార్డు.. గతంలో అనధికారికంగా ఆబర్న్ అబ్షర్ అనే ఆరు నెలల పది రోజుల బాలుడి పేరు మీద ఉంది.

For More News..

తెలంగాణలో కొత్తగా 2,176 కరోనా కేసులు

టీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులు కరువు.. పోటీకే వెనుకాడుతున్న పల్లా, బొంతు

గ్రేటర్‌‌లో బీజేపీ దూకుడు.. టార్గెట్‌‌ 70 సీట్లు

Latest Updates