చండీగఢ్ లో కరోనాతో 6 నెలల పాప మృతి

చండీగఢ్‌: కరోనా బారినపడి ఆరు నెలల పాప మృతిచెందింది. పగ్వారాకు చెందిన ఆ బాలిక గుండె శస్త్ర చికిత్స కోసం చండీగఢ్ లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్ స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)లో చేరింది. అయితే మంగళవారం ఆ పాపకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. వెంటీలేటర్‌ ఉన్న ఆ బాలిక గురువారం మధ్యాహ్నం మృతిచెందింది. కరోనా లక్షణాలతో ఏప్రిల్‌ 9న పగ్వారాలోని అడ్వాన్స్‌డ్‌ పిడియాట్రిక్‌ సెంటర్‌లో చికిత్స పొందింది.

అయితే ఆమెను అక్కడి నుంచి లూథియానాలోని కోవిడ్‌ చికిత్స వసతులున్న నెహ్రూ హాస్పిటల్‌ ఎక్స్‌టెన్షన్‌కు తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి దిగజారుతుండటంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి చండీగఢ్ లోని పీజీఐఎంఈఆర్‌కు తరలించారు.

Latest Updates