మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్ లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రయాణీకులతో వెళుతున్న ఆటోని లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. శివపురి జిల్లాలోని కొలరస్ సమీపంలో ముంబై- ఆగ్రా నేషనల్ హైవే పై  ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారమందుకున్న పోలీసు సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆటోలోనే చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వ్యక్తులను సమీప ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Latest Updates