ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం

ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం
మద్యం మత్తు లో దారుణానికి
పాల్పడిన నిందితుడు
భూపాలపల్లి జిల్లాలో ఘటన

మొగుళ్లపల్లి, వెలుగు: ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో అభం శుభం తెలియని బాలికను
అత్యాచారం చేశాడు. ఎస్సై విజయ్ కుమార్ వివరాల ప్రకారం… జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లికి చెందిన దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. వారి కుమార్తె గ్రామంలోని నానమ్మ దగ్గర ఉంటూ ఓ ప్రైవేట్ స్కూల్ లో యూకేజీ చదువుకుంటోంది. ఆదివారం సెలవు కావడంతో ఉదయం 11గంటల సమయంలో స్నేహితులతో కలిసి సమీపంలోని దుకాణం దగ్గర ఆడుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన జోరుక రమేష్ (38) అక్కడికి వచ్చాడు. ‘‘సెల్ ఫోన్ లో పాటలు పెట్టిస్తాను. మీ బాబాయ్, నానమ్మతో మాట్లాడుతావా… ఫోన్ చేస్తాను” అంటూ మాయమాటలు చెప్పి ప్రతాప్ నగర్ లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. మద్యం మత్తులో బాలికపై అత్యాచారం చేశాడు.

చిన్నారి కేకలు వేయడంతో నిందితుడి ఇంటికి దగ్గర్లోనే ఉన్న బాలిక చిన్న నానమ్మ వెళ్లింది. అప్పటికే రమేశ్ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు నిందితుడిని చితకబాది ముదిరాజ్ భవనంలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపు లోకి తీసుకొని స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. బాలికకు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని ఎస్సై తెలిపారు. బాలిక నానమ్మ ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. స్పాట్ ను భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, చిట్యాల సీఐ సాయిరమణారెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

Latest Updates