ఆస్ట్రేలియాలో భారత మహిళ హత్య..నిందితుల్ని పట్టుకోని పోలీసులు

2014లో ఆస్ట్రేలియా సిడ్నీకి 40 కిలోమీటర్ల దూరంలో భారత్ కు చెందిన మోనికా శెట్టీ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని నిందితులు ఆమె పై యాసిడ్ దాడి చేశారు.

ఈ యాసిడ్ దాడిలో బాధితురాలి తీవ్రంగా గాయాలపాలైంది. అయితే బాధితురాల్ని అత్యవసర చికిత్స నిమిత్తం  స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ 5రోజుల తరువాత మరణించింది. హత్య, బాధితురాలి మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగి 6సంవత్సరాలవుతున్న మోనికాను ఎవరు హత్య చేశారనేది పోలీసులు గుర్తించడంలో విఫలమయ్యారు.

దీంతో తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆస్ట్రేలియా పోలీసులు కీలక ప్రకటన చేశారు. మహిళ హత్యకేసును ఛేదించేందుకు సహాయం చేసిన వారికి 5లక్షల డాలర్లు అంటే భారత్ కరెన్సీ లో 3కోట్లపైగా రివార్డ్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

Latest Updates