దిల్ సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కు ఆరేళ్లు

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుడు ఘటన జరిగిన ఇవాల్టితో ఆరేళ్లు పూర్తయ్యాయి. 2013.. ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ లోని 2 ప్రాంతాల్లో బాంబు పేలుడు జరిగింది. బస్టాప్ లో ఒకటి.. కోణార్క్ థియేటర్ మూలమలుపు.. ఏ1 మిర్చి సెంటర్ దగ్గర మరొకటి.. ఇలా రెండు పేలుళ్లు వెంటవెంటనే జరిగాయి. ఆపి ఉంచిన సైకిల్ పై టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి పేల్చారు టెర్రరిస్టులు. రాత్రి 7 గంటల టైమ్ లో జరిగిన ఈ పేలుడు ఘటనల్లో 18 మంది చనిపోయారు. 140 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుడుకు బాధ్యత వహించింది. నవంబర్ 20, 2016 నాడు.. ఐదుగురు ఐఎం ఉగ్రవాదులకు హైదరాబాద్ లోని ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది.

టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్స్ అసోసియేషన్ పేరుతో ఏర్పాటైన బాధితుల సంఘం ఏటా కోణార్క్ థియేటర్ సమీపంలో నివాళులు అర్పిస్తోంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వంనుంచి ఆసరా అందడం లేదని సంఘం ప్రతినిధులు అన్నారు.

ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి .. బాంబు పేలుడు మృతులకు నివాళులర్పించారు. బాంబు పేలుడుతో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరెపిస్తున్న పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్ధం చేసైనా ఉగ్రవాదాన్ని అణచివేయాలని కోరారు నాయకులు.

 

Latest Updates