ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం: స్కూల్ బెల్టుతో కొట్టి హత్య

దేశంలో ఆడ బిడ్డలకు రక్షణ కరువైంది. పసికందులపైనా పైశాచికంగా దాడికి దిగుతున్నాయి మానవ మృగాలు. హైదరాబాద్‌లోని షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన అమానుష ఘటన ఓ వైపు దేశమంతా సంచలనం రేపుతుండగానే.. ఏ మాత్రం భయం లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నాయి రక్కసి మూకలు. రాజస్థాన్‌లో ఇవాళ మరో రేప్ ఘటన బయటికొచ్చింది. బడికెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, ఆ తర్వాత హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా ఖేతడి గ్రామంలో జరిగిందీ ఘోరం.

ఆటల పోటీకెళ్లి మిస్సింగ్..

మారుమూల గ్రామమైన ఖేతడిలో శనివారం ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. ఆదివారం ఉదయం ముళ్ల పొదల్లో రక్తపు మరకల మధ్య పడి ఉన్న ఆ బిడ్డ శవాన్ని పోలీసులు గుర్తించారు.

MORE NEWS:

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

మందు తాగించి : షాద్ నగర్ డాక్టర్ హత్యలో నమ్మలేని నిజాలు

శనివారం ఉదయం బడిలో జరుగుతున్న ఆటల పోటీకి ఇంటి నుంచి వెళ్లింది ఆరేళ్ల చిన్నారి. మధ్యాహ్నం కల్లా గేమ్స్ అయిపోయినా ఆ పాప ఇంటికి రాలేదు. మద్యాహ్నం మూడు గంటల సమయంలో తల్లిదండ్రులు కంగారుగా చుట్టూ వెతుకులాడారు. కానీ ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

రేప్ చేసి.. స్కూల్ బెల్ట్‌తో కొట్టి.. చుట్టూ బీరు సీసాలు..

ఆదివారం ఉదయం ఊరి చివరన ముళ్ల పొదల మధ్య ఆ చిన్నారిని మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆ చిన్నారి శరీరంపై, ఆ పరిసరాల్లో రక్తపు మరకలు ఉన్నాయని చెప్పారు. ఆ ప్రాంతంలో బీరు సీసాలు, చిప్స్ చిందరవందరగా ఉన్నాయని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రేప్ చేసి స్కూల్ బెల్టుతో కొట్టి చంపారని అన్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Latest Updates