60 ఏళ్లలో కాంగ్రెస్ రైతులకు ఏం చేసింది: మోడీ

modiకర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇకపై ఎవరూ కాపాడలేరన్నారు ప్రధాని నరేంద్ మోడీ. ఇంటికి వెళ్లడానికి ఆ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. మంగళవారం(ఫిబ్రవరి-27) సాయంత్రం ప్రత్యేక విమానంలో హుబ్బళి చేరుకున్న మోడీ తర్వాత హెలికాప్టర్ లో దావణగెరె చేరుకున్నారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప 75వ జన్మదిన సందర్బంగా ఏర్పాటు చేసిన రైతుల బహిరంగ సభ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం న్యాయం చేసిందని ప్రశ్నించారు ప్రధాని మోడీ. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి.. వాటిని అమలు చేస్తున్నామన్నారు. రైతులకు తీవ్రస్థాయిలో అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కనపడకుండా చెయ్యాలని…దీనికి కర్ణాటక కేంద్ర భిందువు కావాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిందని, అయితే ఇక్కడ ఉన్న సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం కమిషన్ల కోసం ఆశపడటంతో ఒక్క పథకం జారీ కాలేదని విమర్శించారు. కర్ణాటకలోని కమీషన్ల కాంగ్రెస్ ప్రభుత్వం మీకు వద్దని.. రైతుబంధు బీఎస్. యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇక్కడున్న అన్నదాతలు ఆశీర్వదించాలన్నారు ప్రధాని.

Posted in Uncategorized

Latest Updates