త‌మిళ‌నాడులో ఒకే రోజు 60 క‌రోనా మ‌ర‌ణాలు

త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. ఆదివారం కూడా కొత్త‌గా 4,150 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,151కు చేరిందని త‌మిళనాడు ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో న‌మోదైన మొత్తం కేసుల్లో ఒక్క‌ చెన్నై న‌గ‌రంలోనే 1,713 మంది ఉన్నారు. అలాగే ఈ ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా 2,186 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య‌ 62,778కి చేరింది. ప్ర‌స్తుతం 46,860 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. క‌రోనా మ‌ర‌ణాలు కూడా త‌మిళ‌నాడులో భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే కొత్తగా 60 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో త‌మిళ‌నాడులో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,510కి చేరింది.

Latest Updates