మొత్తం 60 కోట్ల మంది ఓటేశారు

  • 542 లోక్​సభ స్థానాలకు ముగిసిన ఎన్నికలు.. ఏడు దశల్లో కలిపి 66.62% పోలింగ్
  • 2014లో 66.40 శాతం.. చివరిదైన ఏడో దశలో 64 శాతం టర్నౌట్
  • బెంగాల్​లో హింస.. ఓ పోలింగ్​ బూత్​ వద్ద బాంబు పేలుడు ఫేజ్​లవారీగా పోలింగ్​ సీన్

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్​ ఈవెంట్​ విజయవంతంగా పూర్తైంది. ఆదివారం జరిగిన ఏడో విడత పోలింగ్​తో దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ ముగిసింది. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 542 లోక్​సభ స్థానాల్లో ఓటింగ్​ పక్రియ పూర్తైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏడు దశల్లో కలిపి యావరేజ్​గా 66.62 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 90 కోట్ల మంది రిజిస్టర్డ్​ ఓటర్లుండగా, అందులో సుమారు 60 కోట్ల మంది ఓట్లేశారు. ప్రజాస్వామిక హక్కును వాడుకోవడంలో నార్త్​ ఇండియన్ల కంటే సౌత్​ ఇండియన్లు మరోసారి చైతన్యం ప్రదర్శించారు. తొలి నాలుగు ఫేజ్​లతో పోల్చుకుంటే, చివరి మూడు దశల్లో ఓటింగ్​ తగ్గడమే అందుకు నిదర్శనం. ఏడు ఫేజ్​ల్లో ఎన్నికల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ, 23 నాటి కౌంటింగ్​కు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. తమిళనాడులోని వెల్లూరు లోక్​సభ స్థానంలో ఎన్నిక రద్దైన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో మొత్తం 66.40 శాతం ఓటింగ్​ రికార్డయింది. ఈసారి స్వల్పంగా పెరిగింది.

ఏడో ఫేజ్​లో 64 శాతం

ఏడో ఫేజ్​లో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు పోలింగ్​ ప్రశాంతంగా జరిగింది. చాలా చోట్ల ఈవీఎంలలో లోపాలు తలెత్తాయి. యావరేజ్​గా 64.5 శాతం ఓటింగ్​ జరిగినట్లు ఈసీ తెలిపింది. ఉత్తరప్రదేశ్​లోని 13 స్థానాలకుగానూ 56.84 శాతం, పంజాబ్​(13)లో 64.71 శాతం, వెస్ట్​బెంగాల్​(9)లో 73.51 శాతం, హిమాచల్​ ప్రదేశ్​(4)లో 70.40, జార్ఖండ్​(4)లో 71.16, మధ్యప్రదేశ్​(8)లో గరిష్టంగా 75.38 శాతం, బీహార్​(8)లో అతి తక్కువగా 53.36 శాతం పోలింగ్​ నమోదైంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఓటింగ్​ శాతం 58.10గా రికార్డైంది.

బెంగాల్​లో మళ్లీ హింస

తొలిసారిగా ఈసీ ఆర్టికల్​ 324 ప్రయోగించిన వెస్ట్​బెంగాల్​లో ఏడో దశలోనూ హింస ప్రజ్వరిల్లింది. కోల్​కతా సిటీతోపాటు పోలింగ్​ జరిగిన 9 స్థానాల్లో టీఎంసీ, బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. పలు చోట్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ బీజేపీ, టీఎంసీ వర్గీయులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. పంజాబ్​లోనూ హింస నమోదైంది. కాంగ్రెస్​, అకాలీదళ్ కార్యకర్తల మధ్య కొట్లాటలు జరిగాయి.

Latest Updates