ఐదు రాష్ట్రాల్లో న‌మోద‌వుతున్నకేసులు 60 శాతం..రిక‌వ‌రీ అవుతున్న కేసులు 60శాతం

దేశంలో మ‌రోసారి రికార్డ్ స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24గంట‌ల్లో 97,570 కేసులు నమోదు కాగా దీంతో ఐదు రాష్ట్రాల్లో క‌రోనా న‌మోదైన కేసుల సంఖ్య 60 శాతంగా ఉన్న‌ట్లు కేంద్రం అరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు.

24గంట‌ల్లో మ‌హ‌రాష్ట్ర‌లో 24వేల కేసులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, క‌ర్నాట‌క‌లలో 9వేల కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన బులిటెన్ లో పేర్కొంది.

తాజాగా న‌మోదైన 60 శాతం కేసులు ఢిల్లీ, మ‌హ‌రాష్ట్ర‌, ఆంధ్ర‌ప్రదేశ్, క‌ర్నాట‌క‌, త‌మిళనాడుల‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

గ‌డిచిన 24 గంట‌ల్లో మొత్తం 1201 మందికి క‌రోనాతో మ‌ర‌ణించ‌గా.. 36శాతం మ‌ర‌ణాలు న‌మోదయ్యాయి.

ఇక మ‌హ‌రాష్ట్రాలో 442 మంది, క‌ర్నాట‌క‌లో 130 మంది మ‌ర‌ణించారు. దీంతో ఆ ఐదురాష్ట్రాల్లో క‌రోనా మ‌ర‌ణాలు 69శాతం ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు.

కేంద్ర ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల్లో 81,533 మంది క‌రోనాతో రిక‌వ‌రీ అయ్యార‌ని..దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్, క‌ర్నాట‌క‌, మ‌హ‌రాష్ట్ర, త‌మిళ‌నాడు, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ల్లో క‌రోనా రిక‌వ‌రీ కేసుల సంఖ్య 60 శాతం ఉన్న‌ట్లు నిర్ధారించారు.

Latest Updates