600 కేజీలు ఉంది : నరమాంస మొసలి.. ఎనిమిదేళ్లకి దొరికింది

ఓ మొసలిని పట్టుకునేందుకు ఎనిమిదేళ్లుగా ఆస్ట్రేలియా అధికారులు చేసిన ప్రయత్నం విజయవంతమైంది. 60 ఏళ్ల వయస్సు, 600 కేజీల బరువు, 4.7 మీటర్ల ఎత్తుతో చూడడానికి భయంకరంగా ఉన్న ముసలిని కాథెరైన్‌ నదిలో మంగళవారం(జులై-10) పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తాళ్లతో బంధించి ఉన్న మొసలిని జంతు సంరక్షణా కేంద్రానికి తరలించారు. 2010లో మొదటిసారి ఈ మొసలిని చూశామని, అప్పటినుంచి దీన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, చివరకు మంగళవారం కాథరైన్‌ నది నుంచి దిగువకు ప్రవహించే నీటిలో దీనిని పట్టుకున్నట్లు తెలిపారు. ఉప్పునీటి మొసళ్ల కారణంగా ప్రతి ఏటా ఆస్ట్రేలియాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మొసళ్ల సంఖ్యను తగ్గించేదుకు ఆస్ట్రేలియా ప్రయత్నిస్తుంది. ఏడాదికి సమస్యాత్మకంగా ఉన్న 250 మొసళ్లను పట్టుకుంటున్నారు

Posted in Uncategorized

Latest Updates