దళిత స్కాలర్‌ తేల్ తుంబ్డేకి 600 మంది మేధావుల మద్దతు

దాడులు ఆపాలంటూ ఇండియన్ సివిల్ వాచ్ డిమాండ్‌

వాషింగ్టన్: దళిత మేధావి ఆనంద్ తేల్ తుంబ్డేకు అమెరికా, యూరప్ విశ్వవిద్యాలయాలకు చెందిన 600 మంది మేధావులు మద్దతు ప్రకటించారు. ” 2018 ఆగస్టు 28న మహారాష్ట్ర పోలీసులు తేల్ తుంబ్డే ఇంట్లో అక్రమంగా సోదాలు చేశారు. ఆయనను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం. తప్పుడు ఆరోపణలతో ఆయనపై దాడులను వెంటనే ఆపాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని ఇండియన్ సివిల్ వాచ్ (ఐసీడబ్ల్ యూ) పేరుతో ప్రకటన విడుదల చేశారు.

ఐసీడబ్ల్యూలో ప్రిన్స్ టన్, హార్వర్డ్, యాలె, ఆక్స్ ఫర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తోపాటు పలు వర్సిటీల మేధావులు సభ్యులుగా ఉన్నారు. ” తేల్ తుంబ్డేపై మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిరాధార ఆరోపణలతో చర్యలకు దిగాయి. పౌరుల హక్కులను కాలరాసే యూఏపీఏ (అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద అరెస్టు చేసి ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది ప్రజాస్వామ్యం, పౌరహక్కులపై దాడి. వెంటనే దీన్ని ఆపాలి” అని ప్రకటనలో పేర్కొన్నారు. సంయుక్త ప్రకటనపై 600 మంది మేధావులు సంతకాలు చేసినట్టు ఐసీడబ్ల్యూ అధికార ప్రతినిధి రాజాస్వామి అన్నారు.

Latest Updates