ఏపీలో కొత్త‌గా 605 క‌రోనా కేసులు.. 24 గంట‌ల్లో 10 మంది మృతి

ఏపీలో రోజు రోజుకీ క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 605 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 11,489కి చేరింది. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై ఏపీ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో న‌మోదైన 605 క‌రోనా కేసుల్లో 570 మంది లోక‌ల్స్, ఒక‌రు విదేశం నుంచి, 34 మంది ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన‌వారు ఉన్నారు. ఈ ఒక్క రోజులో క‌ర్నూలు, కృష్ణా జిల్లాల్లో న‌లుగురు చొప్పున, విశాఖ‌ప‌ట్నం, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్క‌రు క‌లిపి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 146కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 5196 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో 6,147 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా క‌రోనా కేసుల వివ‌రాలు:

Latest Updates