61కి చేరిన అమృత్‌సర్‌ మృతుల సంఖ్య

అమృత్‌సర్‌ : అమృత్‌సర్‌ సమీపంలోని జోడా ఫాఠక్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద దసరాను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం 6.45 గంటలకు నిర్వహించిన రావణ దహనాన్ని చూసేందుకు వచ్చిన స్థానిక ప్రజలపైకి రైలు దూసుకుపోయిన దుర్ఘటనలో 61 మంది మృతి చెందారు. మరో 72 మంది గాయపడ్డారు. రోజంతా దసరా పండుగ చేసుకొని… సాయంత్రం దశకంఠుడి దహనకాండను కళ్లారా చూసేందుకు ఉత్సాహంతో జోడా ఫాఠక్‌ రైల్వే క్రాసింగ్‌ వద్దకు చేరుకున్నారు ఆ నగర ప్రజలు. చెవులు చిల్లులు పడేలా బాణసంచా పేలుళ్లు…  కళ్లు మిరుమిట్లు గొల్పే కాంతులతో సాగిన రావణుడి దహనకాండను ఒళ్లంతా కళ్లు చేసుకొని చూస్తున్నారు. ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఆ సంబరంలో రైలుపట్టాల మీద నిలబడ్డామన్న సంగతినే మరిచిపోయారు ప్రజలు. శరవేగంగా దూసుకొస్తున్న జలంధర్‌-అమృత్‌సర్‌ రైలు తమ పాలిట యమశకటమవుతుందని పసిగట్టలేకపోయారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఇనుపచక్రాల కింద పడి నలిగిపోయారు. నిన్నఈ ఘటనలో 50 మంది మృతి చెందగా ప్రస్తుతం మృతుల సంఖ్య 61 చేరింది.

Posted in Uncategorized

Latest Updates