ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,514 కు చేరుకుందని అక్కడి ఆరోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది. ‘‘గడిచిన 24 గంటల్లో 8,415 శాంపిల్స్‌ని పరీక్షించగా 62 మందికి పాజిటివ్ కన్ఫామ్ అయింది. 51 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం‌తో డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ కు ట్రీట్​మెంట్ పొందుతూ కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు”అని పేర్కొంది. ఏపీలో ఇప్పటివరకు 1731 మంది డిశ్చార్జి కాగా.. 55 మంది చనిపోయారు.

Latest Updates