ఏపీలో కొత్తగా మరో 62 మందికి కరోనా

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు.. మీడియాకు విడుదల చేసిన బులెటిన్ నెం. 134లో పేర్కొన్నారు అధికారులు. దీంతో, రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 955 కు చేరింది. ఇప్పటి వరకు 145 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా 29 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 781 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక, గత 24 గంటల్లో కర్నూల్ లో అత్యధికంగా 27 కేసులు నమోదు కాగా .. కృష్ణా జిల్లాలో 14, గుంటూరులో 11, అనంతపురంలో 4, ప్రకాశంలో 3, తూర్పు గోదావరి జిల్లాలో 2, నెల్లూరులో 1 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలులో 261 కరోనా కేసులు నమోదు కాగా, గుంటూరులో 206 కేసులు నమోదయ్యాయి.

Latest Updates