మిసెస్ ఇండియా తెలంగాణగా  63 ఏళ్ల మహిళ

తెలంగాణ-2109 అందాల పోటీల సూపర్ క్లాసిక్ కేటగిరీలో డాక్టర్ నక్కాన శోభాదేవి విజేతగా నిలిచి అందాల భామ కిరీటం దక్కించుకున్నారు. ఈమె వయస్సు 63 ఏళ్లు. లండన్ లో ఫేమస్ డాక్టర్ గా శోభాదేవికి గుర్తింపు ఉంది. ఆమె 20 ఏళ్ల పాటు లండన్ లో వైద్య సేవలు అందించారు.  అయితే మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపనతో భారత్ వచ్చిన శోభాదేవి హైదరాబాద్ లోని లైఫ్ స్పాన్ ఆస్పత్రిలో డయాబెటాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమెకు వైద్యం వృత్తి అయితే ఫ్యాషన్ రంగం ప్రవృత్తి అని చెప్పాలి. ఆ మక్కువతోనే మిసెస్ ఇండియా తెలంగాణ అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు ఏకంగా టైటిల్ ఎగరేసుకెళ్లారు. 63 ఏళ్ల ఏజ్ లోనూ అందాల పోటీలలో పాల్లొని అందరి మనసులు గెలుచుకుని టైటిల్ సాధించారు శోభాదేవి.

Latest Updates